2025-01-13T15:30:00
2024-09-13T17:39:10
విశ్వంలోనే విశిష్టమయిన మన దేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలు, 5100 పట్టణాలు, 380 నగరాలు. ఈ సుమ వనంలోని ప్రతి ఆకు, ప్రతి పువ్వు, ప్రతి రెమ్మ, ప్రతి కొమ్మ, ప్రతి మొక్క, ప్రతి చెట్టు విలువయినదే. మన భారతావనిలో నివసించే 8 అతి పెద్ద మతాలలోని 6వేల కులాలకు చెందిన 1700కు పైగా భాషలు మాట్లాడగలిగే 125 కోట్ల మంది భారతీయులు మన సోదరులు. ఎంత అద్భుతం! శతాబ్దాలుగా కలిసిమెలిసి సహజీవనం […]
2024-09-13T17:39:09
”ఆయనే తన పవ్రక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నిం టిపై ఆధిక్యం వహించేలా చేయడానికి! ఈ విషయం బహుదైవారాధకులకు (సత్య విరోధులకు) ఎంతగా సహించరానిదైనా సరే”. (అస్ సఫ్: 9)
2024-09-13T17:39:08
ప్రియమైన ధార్మిక సోదరు లారా! మీరెప్పుడైనా ఈ విషయమై ఆలోచించారా? మన చుట్టూ వ్యాపించి ఉన్న ఈ అనంతమైన విశ్వవ్యవస్థ దానంతట అదే ఉనికిలోకి వచ్చిందా? లేక మరెవరి ద్వారానైనా ఉనికిలోకి తీసుకు రాబడిందా? ఈ విశ్వములో ఉన్న విభిన్న శక్తులు ఒకే దేవుని ఆధీనంలో ఉన్నాయా? లేక అనేక దైవాల ఆధీనంలో ఉన్నాయా? ఇదే విధంగా మానవుని జయాపజయాలు, లాభనష్టాలు, వ్యాధి స్వస్థత, సమస్తము స్వయంగా మానవుని అధీనంలో ఉన్నాయా? విభిన్న శక్తుల ఆధీనంలో ఉన్నాయా? […]
2024-09-13T17:39:07
ఇస్లాం అంటే ఏమిటి? ‘ఇస్లాం’ అన్న పదం అరబీ భాషలోని ‘సల్మున్’ (శాంతి), ‘సిల్మున్'(విధేయత) అన్న పదాల నుండి ఉద్భవించింది. ఆధ్యాత్మికంగా చూస్తే ‘మనల్ని మనం దైవానికి సమర్పించు కోవటం ద్వారా ఇహపరాల్లో శాంతి సాధిం చడం’. ‘ముహమ్మదీయ ధర్మం, ముహమ్మ డనిజం, ముహమ్మదీయులు’అనడం పొరపాటు. ఎందుకంటే ఈ పదాలు దైవాన్ని కాక, ముహమ్మద్ (స)ని ఆరాధిస్తారన్న అపోహ కల్గి స్తాయి. అరబీ భాషలో ‘అల్లాహ్‌ా’ అంటే ‘సర్వో న్నతుడైన దైవం’ అని అర్థం. ముస్లిములే కాక […]
2024-09-13T17:39:06
శీ కంచి శంకరాచార్యుల వారికి, గౌరవనీయులైన శంకరాచార్య స్వామిగల్! మీకు శాంతి కలుగుగాక. ఓ సారి మీరు ఆశ్చర్యపడుతూ, హిందూ గ్రంథాలలో ఎక్కడైనా ఇస్లామ్ గురించి, ముహమ్మద్ ప్రవక్త గురించి ప్రస్తావన ఉందా అని నన్ను ప్రశ్నించారు.హిందూ గ్రంథాల నుంచి కొన్ని కొటేషన్లు మీకీ లేఖలో రాస్తున్నాను. హిందూ గ్రంథాల్లో భవిష్య సూచనలు హిందూ గ్రంథాల్లో దైవప్రవక్త ముహమ్మద్ (స) గురించి అనేక సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని సూచనలు పురాణా ల్లో ఉన్నాయి. భవిష్యపురాణంలో ఉన్న […]
2024-09-13T17:39:05
(సంక్షిప్తంగా) ‘తెలుగునకు పర్యాయపదమై వెలుగు విక సించె, వెలుగునకు ఆమ్రేడితమ్మై తెలుగు వినిపించె’ కవితా పయోనిధి దాశరథి భావోద్వేగాలకు అక్షర రూపమది. ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ…గతమెంతో ఘనకీర్తి కలవోడ’ అన్న వేములపల్లి శ్రీ కృష్ణ ప్రబోధాత్మక గీతం మూడు నాలుగు థాబ్దాల క్రితం తెలుగునాట మార్మోగిపో యేది. తెలుగుఆట, తెలుగుపాట, తెలుగు నుడికారం, తెలుగు మమకారం-సం క్రాంతికి వేసిన రథం ముగ్గులా మున్నూట అరవై అయిదురోజులూ జాతి మనోరథమై సాగి, ముంగిళ్లలో తెలుగుదనాన్ని రాశులు పోసిన రోజులవి. […]
2024-09-13T17:39:04
ఆంధ్ర సాహిత్యం రెండు వేల సంవత్సరాల పంట. ఆ రెండు వేల సంవత్సరాలలో వేనవేల కావ్యాలు, తత్వాలు, సిద్ధాంతాలు పుట్టాయి. 8 కోట్ల మంది ఆంధ్ర ప్రజల్లో తెలుగు మాట్లాడే వారు 87.77/ శాతం అయితే ఉర్దూ మాట్లాడేవారి శాతం 8. 63/, హిన్దీ మాట్లాడేవారి శాతం 2. 77/, తమిళ్ మాట్లాడేవారి శాతం 1. 13/గా ఉంది. యుగాలు గడిచినా, తరాలు మారినా ఆరుద్ర అన్నట్టు నేటికీ – తేనెకన్నా మధురంరా తెలుగు. ఆ తెలుగుదనం […]
2024-09-13T17:39:03
పాలస్తీనా విభజనకు నాంది పలికిన నవంబరు 29వ తేదీనే సరిగ్గా 65 సంవత్సరాలకు ఐక్యరాజ్య సమితిలో పాలస్తీనా గుర్తింపులో మరో ముందడుగు పడటం హర్షణీయం. స్వతంత్య పాలస్తీనా ఆవిర్భావాన్ని అడ్డుకుంటున్న అగ సామాజ్య్ర వాదులకు, ఇజాయ్రీల్‌కు ఐక్యరాజ్య సమితి సాధారణంగా అసెంబ్లీ ఆమోదించిన తీర్మానం రాజకీయంగా, దౌత్య పరంగా చెంప పెట్టనే చెప్పాలి. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వాటిలో ఇజాయ్రీల్‌తో చేతులు కలిపిన ధనిక దేశాలు కొన్ని ఉన్నప్పటికీ పెద్ద దేశం కెనడా ఒక్కటే. మిగిలిన […]
2024-09-13T17:39:02
1) STOP WORRYING: చింతలకు స్వస్తి చెప్పండి – జరిగిపోయిన దాని గురించి గానీ, జరగబోయే దాని గురించిగానీ చింత పడటం మానుకోవాలి. దాని వల్ల మంచి కన్నా చెడే ఎక్కవ జరుగుతుంది. కొత్త ఆలోచనలను, సృజనాత్మకతను కోల్పోతాము. 2) ENERGIZE YOURSELF: శక్తిసామర్థ్యాలను పెంచుకోండి – ఎప్పటికప్పుడు మనల్ని మనం ఉత్తేజ పర్చుకుంటూ, మనలోని స్కిల్స్‌ను పెంచుకునే ప్రయత్నం చేయాలి. నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. 3) LOVE YOURSELF: స్వీయ గౌరవం – “IF […]
2024-09-13T17:39:01
”రమజాను మాసం ఖుర్‌ఆన్ అవతరించిన మాసం. అది మానవు లందరికీ మార్గదర్శకం. అందులో సన్మార్గంతోపాటు సత్యాసత్యాలను వేరుపర్చే స్పష్టమైన నిదర్శనాలున్నాయి. కనుక మీలో ఎవరు ఈ మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసాలు ఉండాలి. ”. (దివ్యఖుర్‌ఆన్- 2: 185) షరీయతుని అనుసరిస్తూ ప్రతి ముస్లిం నిర్ణీత కాలం వరకు ఉపవాసం ఉండాలి. ఒక రోజు ముందుగాని, ఒక రోజు వెనుక గానీ చేయకూడదు. ”మీరు (రమజాను) నెలవంకను చూసి ఉపవాసాలుండండి. మళ్ళీ మీరు (షవ్వాల్) నెలవంకను […]
2024-09-13T17:39:00
మానవాళికి దైవభీతినీ, నైతిక రీతిని ఉపదేశించడానికి ఆవిర్భవించిన అసంఖ్యాక మానవ రత్నాల రాసిలో అగ్రజులు మహనీయ ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం). దైవ విశ్వాసం గల ఒక విశ్వాసి, ఒక ఉద్యోగి, ఒక యజమాని, ఒక కార్మికుడు, ఒక న్యాయాధిపతి, ఒక సైనికుడు-అందరూ వారి జీవితాల్లో ప్రతినిత్యం ప్రవక్త ముహమ్మద్ (స) వారి ఆదర్శాలు ప్రతిబింబించాలని మనస్ఫూర్తి గా కోరుకుంటారు. ఆయన (స) పట్ల మనకున్న ప్రేమ మన జాతిపౌర జీవితంలో, పరిపాలనా వ్యవస్థలో, ఆచారవ్యవహారాలలో […]
2024-09-13T17:38:59
హజ్రత్ అబూ బకర్, హజ్రత్ ఉమర్, హజత్ ఉస్మాన్, హజ్రత్ అలి (రజియల్లాహు అన్హుమ్) – వీరినే ఖులఫాయె రాషిదీన్ – సద్వర్త నులైన పరిపాలకులు అనంటారు. దైవ అంతిమ ప్రవక్త ముహమ్మద్ (స) వారి మరణాననంతరం వీరు అల్లాహ్‌ా ఆదేశాలను, ఆయన ప్రవక్త సంప్రదాయాలను అమలు పర్చారు. వాటి ప్రాతిపదికన పరిపాలిం చారు. ధర్మ సంస్థాపనలో, న్యాయ వ్యవస్థ స్థాపనలో, ఇస్లాం ధర్మ ప్రచారంలో వీరు పోషించిన పాత్ర, పడిన శ్రమ అమోఘమైనది. ఈ నలుగురు […]
2024-09-13T17:38:58
ముహమ్మద్ కువైట్‌లో రమజాను నెల సన్నాహాలు షాబాన్ నెల నుంచే ఆరంభమవుతాయి. శుభాలను ఆర్జించడం కోసం ప్రవక్త (స) సూచించిన అన్ని సున్నత్ రోజాలు పాటిస్తారు. ఎంతో ఆసక్తిగా రోజురోజూ గుర్తు చేసుకుంటూ రమజాన్ తొలి దినం కోసం ఎదురు చూస్తారు. ఈ విధంగా నింగిలో రమజాన్ మాసపు నెలవంకను చూడగానే అల్లాహ్‌ాకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తీవిశ్వాసాలతో అందరూ రోజాను మొదలెడతారు. ఈ నెలలో ఎక్కువగా ఖుర్‌ఆన్ పారాయణం చేయడం, వినడం, దానధర్మాలు చేయడం చేస్తారు. ఉద్యోగస్తులకు […]
2024-09-13T17:38:57
– అబ్దుల్ ఖాదిర్ ఉమ్రీ విశ్వసించిన జనులారా! నేను రమజాను మాసాన్ని. మీ క్షేమాన్ని, సౌఖ్యాన్ని, వృద్ధిని, ఇహపరలోకాల సాఫల్యాన్ని కోరి, మీ వ్యక్తిగత, సామూహిక శీల నిర్మాణం కోసం విశ్వప్రభువైన అల్లాహ్‌ా తరఫు నుండి వచ్చాను. నెలరోజులపాటు మీతోనే ఉన్నాను. మీరు నన్ను ఎంతగానో గౌరవించారు, ఆదరించారు. మీరు ఎంతో ఆసక్తితో, భక్తీ శ్రద్ధలతో అల్లాహ్‌ా ప్రసన్నతను, పరలోక సాఫల్యాన్ని కాంక్షిస్తూ ఉపవాసాలు పాటించారు. నమాజులను స్థాపించారు. ఖుర్‌ఆన్ పారాయణం చేశారు. రాత్రి వేళల్లో తరావీహ్‌ా […]
2024-09-13T17:38:56
ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ ముస్లింలు జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’లో ఎన్నో పరమార్థాలు, పరిశుద్ధమైన భావాలు ఇమిడి ఉన్నాయి. అసలీ పండుగ పేరే ‘ఫిత్రాల పండుగ’ (ఈదుల్ ఫిత్ర్) కావటం గొప్ప విషయం. ఫిత్రాల ప్రధాన ఉద్దేశ్యం: 1) నెల రోజులు కేవలం తమ ప్రభువు ప్రసన్నత కోసం ఉపవాసాలు పాటించిన వారంతా ఓ విధమైన ప్రత్యేక అనుభూతిని, ఆనందాన్ని, తృప్తిని పొందటం సహజం. అది నిజంగానే వారి కోసం పర్వదినం. ఆ రోజున వారు కొత్త బట్టలు ధరిస్తారు. […]
2024-09-13T17:38:55
ముహమ్మద్ అజీజుర్రహ్మాన్ ప్రపంచమంతటా ముస్లింలు – ఏక కాలంలో – నెల రోజుల పాటు ఉపవాసాలు పాటించిన తర్వాత తమ ప్రభువు యెడల కృతజ్ఞతా సూచనగా రెండు రకతుల నమాజు చేసి ‘ఈదుల్ ఫిత్ర్’ జరుపు కుంటారు. కాబట్టి ఈ పండుగ కూడా ఒక గొప్ప ఆరాధనే. నిజానికిది శ్రద్ధగా ఉపవాసాలు పాటించి, తరావీహ్‌ా నమాజులు చేసి, సత్కార్యాలలో శాయ శక్తులా పాల్గొన్నవారి పండుగ. నెల రోజులపాటు వారు పడిన కఠోర శ్రమకు గాను తమ యజమాని […]
2024-09-13T17:38:54
– ఆస్క్ ఇస్లాం పీడియా అల్లాహ్ ఔన్నత్యాన్ని తెలిపే మూడు అంశాలు – అల్లాహ్ అధికారాల్లో ఏకత్వం అల్లాహ్ పేర్లు, లక్షణాల్లో ఏకత్వం అల్లాహ్ ఆరాధనల్లో ఏకత్వం. ప్రతి ముస్లిం అల్లాహ్ ఒక్కడే అని, ఈ సృష్టిలో ఆయన భాగస్వాములు ఎవ్వరూ లేరని, ఆయన పేర్లు మరియు లక్షణాల్లో ఎవ్వరూ సాటిలేరని విశ్వసిస్తాడు. అల్లాహ్ ఒక్కడే పూజించదగినవాడు అని తన చేష్టల ద్వారా చాటుతాడు. అల్లాహ్ పై ఈమాన్ నిర్వచనం ‘అల్లాహ్ పై విశ్వాసం’ అంటే- అల్లాహ్ ఉనికిని, […]
2024-09-13T17:38:53
ఖురాన్ కథామాలిక పుస్తకం నుంచి (పూర్వ కాలంలో కథకులు, గొప్ప సంపద అని చెప్పడానికి ‘ఖారూన్ ఖజానా’ అని పోల్చి చెప్పేవారు. అంటే సాటిలేని మహా సంపద అన్న భావంతో అలా చెప్పేవారు) ”చివరికి మేము ఖారూన్‌ను, అతని నివాసాన్ని నేలలో కూర్చివేశాము. అప్పుడు అల్లాహ్‌ా బారి నుండి అతన్ని ఆదుకోవటానికి ఏ సమూహమూ లేకపోయింది. మరి వాడు సయితం తనకు ఏ సాయమూ చేసుకోలేకపోయాడు”. (ఖుర్‌ఆన్ – 28: 81) ఖారూన్, ప్రవక్త మూసా (అ) […]
2024-09-13T17:38:52
రాకెట్టు వేగంతో దూసుకుపోతున్న ప్రగతి, త్వర త్వరగా మారుతున్న పరిస్థితులలో మానవ సమాజం రకరకాల సమస్యల వలయంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతోంది. ఒనరులు పెరుగుతున్నా, ఓనమాలు నేర్చుకునేవారు అధికమవుతున్నా సామాజిక రుగ్మతలు, సంఘంలోని అసాంఘీక కార్యకలాపాలు మాత్రం తగ్గడం లేదు. ప్రతి ఇంటిలోనూ ఈనాడు పెద్దలకు, పిల్లలకూ మధ్య అవగాహనా లోపం కొట్టొచ్చినట్టు కన్పిస్తోంది. నైతిక విలువలలో మనం ఇముడ్చుకోలేనన్ని మార్పులు పొడ సూపు తున్నాయి. వెనుకటి తరాల వారికి ఎదురవని అనేక సమస్యలు ఈనాడు మనకు ఎదురవుతున్నాయి. […]