E-Da`wah Committee Directory

Your Way to Understanding Islam

عربي English
శాంతి సందేశం

శాంతి సందేశం

2018-04-04T19:16:10

.ఈ విశ్వం యావత్తూ ఇందులో ఉన్న సమస్తమూ విశ్వప్రభువు అయిన అల్లాహ్‌దే. ఆయనే సృష్టికర్త, పోష కుడు, పాలకుడు, నిజప్రభువు. ఆయన ముందరే అందరూ తల వంచాలి. ఆయననే ప్రార్థించాలి. ఆయనకే విధేయులై ఉండాలి. ఆయననే ఆరాధించాలి. ఆయన ఆజ్ఞల్నే పాలించాలి.

విధివ్రాత నియమాలు – 7

విధివ్రాత నియమాలు – 7

2018-04-04T18:55:50

Originally posted 2018-04-04 18:48:32.    ”మీరు దెబ్బ తిన్నారనుకుంటే మీ ప్రత్యర్థులు కూడా అలాగే దెబ్బ తిన్నారు. మేము ఈ కాల చక్రాన్ని జనుల మధ్య త్రిప్పుతూ ఉంటాము”.  (ఆలి ఇమ్రాన్:140)  అద్భుతమైన ఈ సృష్టి వెనక గల పరమార్థంలో ఒకటేమంటే ఇక్కడ సత్యాసత్యాల, ధర్మాధర్మాల మధ్య సంఘర్షణ కొనసాగుతుంది. కొన్ని వేళల్లో సత్యం గెలుస్తోంది. మరికొన్ని సందర్భాలలో అసత్యం గెలుస్తుంది. అయితే కడకు అల్లాహ్‌ా సత్యానికి గెలుపును, అసత్యానికి ఓటమిని ఇస్తాడు. ఉపకారం ద్వారం అపకారాన్ని […]

ప్రపంచ ధర్మాల్లో దైవభావన

ప్రపంచ ధర్మాల్లో దైవభావన

2018-04-04T18:55:49

”సృష్టి పుట్టుకకు సంబంధించిన రహస్యాన్ని కేవలం ధర్మం మాత్రమే చేదించ గలదని నేను విశ్వసిస్తున్నాను.” ఆక్స్‌ఫర్డ్‌ డిక్షనరీలో ధర్మాన్ని ఈ విధంగా నిర్వచించటం జరిగింది:’ఒక మానవాతీత మైన శక్తిపై విశ్వాసముంచటం ప్రత్య కించి, విధేయతకు, ఆరాధనకు అర్హమైన దేవుడు లేక దేవుళ్ళు ఉనికిపై విశ్వాస ముంచటం.’

మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు

మూడు ప్రశ్నలు మూడు సమాధానాలు

2018-04-04T18:55:48

అనేక మంది మేధావులు ఈ మూడు ప్రశ్నలకు సమాధానం వెతకడంలో తలమునకలై ఉన్నారన్నది వాస్త వం. మానవ జీవితంలో కీలక పాత్ర పోషించే ఆ మూడు ప్రశ్నలు – 1) మనం ఎక్కడ నుంచి వచ్చాము? 2) మనం ఎందు కోసం వచ్చాము? 3) చివరి మన గమ్యస్థానం ఏది?

మానవ జీవతంపై తౌహీద్‌ ప్రభావం

మానవ జీవతంపై తౌహీద్‌ ప్రభావం

2018-04-04T18:55:47

తౌహీద్‌ ప్రకారం జీవితం గడిపిన వారు ఇహలోకంలో సఫలీకృతులు కావడమే కాక, పరలోకంలో స్వర్గంలో ప్రవేెశిస్తారు. తౌహీద్‌ను త్రోసి పుచ్చినవారు ఐహికంగానూ అప్రతిష్ట పాలవుతారు.

సకల చింతలకు చికిత్స పరలోక చింతన

సకల చింతలకు చికిత్స పరలోక చింతన

2018-04-04T18:55:46

ఖుర్‌ఆన్‌లో ప్రాపంచిక జీవితాన్ని ఒక క్రీడగా, మాయావస్తువుగా అభి వర్ణించడానికి కారణం- క్రీడ మనిషిని ఉల్లాస పరిస్తే, మాయ మనిషి మోస పుచ్చుతుమది, లేనిది ఉన్నట్టుగా నమ్మబలుకుతుంది. అసలు వాస్తవాల పట్ల ఏమరుపాటుకు గురి చేస్తుంది.

జీవన ప్రమాణ పెరుగుదల జకాత్

జీవన ప్రమాణ పెరుగుదల జకాత్

2018-04-04T18:55:45

ఐక్యరాజ్య సమితికి చెందిన లెక్కల ప్రకారం 2000 కోట్ల నుంచి 10000 కోట్ల అమెరికా డాలర్లు అంటే ఇప్పటి లెక్కల ప్రకారం 120000 కోట్ల రూపాయల నుంచి 6000000 కోట్ల రూపాయల వరకు ఏటా ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జకాత్‌ చెల్లిస్తున్నారు.

జకాత్‌ పూర్వ పరాలు

జకాత్‌ పూర్వ పరాలు

2018-04-04T18:55:44

జకాత్‌ అంటే, శుద్ధత, శుభం, సమృద్ధి అన్న అర్థాలొస్తాయి. షరీ యతు పరిభాషలో జకాత్‌ ఓ ప్రత్యేక సంపదలోని నిర్ణీత భాగం. జకాత్‌ రూపంలో తీయబడే ఈ భాగం ఖుర్‌ఆన్‌లో పేర్కొనబడిన ప్రత్యేకమ యిన వ్యక్తులకు మాత్రమే ఇవ్వ బడుతుంది.

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు…

చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు…

2018-04-04T18:55:43

చిత్తశుద్ధితో, కేవలం అల్లాహ్‌ సంతోషం పొందే ఉద్దేశ్యంతో వ్యయపరిచేవారి వ్యయాన్ని మెట్ట ప్రదేశంలో ఉన్న తోటతో పోల్చవచ్చు. భారీ వర్షం కురిస్తే అది రెట్టింపు పంటను ఇస్తుంది.

శాంతి నగరం మక్కా

శాంతి నగరం మక్కా

2018-04-04T18:55:42

ప్రాంతాల్ని, దేశాల్ని, రాజ్యాల్ని సయితం అల్లాహ్‌ా నామరూపాల్లేకుండా చేెసే స్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ గృహ రక్షణ లోక రక్షణ. ఈ గృహ వినాశనం, లోక వినాశనం.

మహిమాన్విత నగరం మక్కా పురం

మహిమాన్విత నగరం మక్కా పురం

2018-04-04T18:55:41

అది ఎంతో శుభప్రదమయినది సృష్టి మొత్తంలో కేవలం కాబా గృహ చుట్టు ప్రదక్షిణ చేయడం మాత్రమే సమ్మతించ బడింది. ఖుర్‌ఆన్‌లో ఇలా ఉంది: ”ఆ తర్వాత వారు (దేవుని) ఆ ప్రాచీన గృహా నికి ప్రదక్షిణ చేయాలి”.

త్యాగం లేకుండా ఏ ఆశయమూ సిద్ధించదు

త్యాగం లేకుండా ఏ ఆశయమూ సిద్ధించదు

2018-04-04T18:55:40

త్యాగం లేనిదే సమాజంలో అనురాగమూ లేదు, అనురక్తీ లేదు. మనుగడలో మమతలు పెరగాలంటే ప్రతి వ్యక్తీ ఎదుటివారి కోసం ఏదో ఒకటి త్యాగం చెయ్యవలసి వస్తుంది – కోరికల్ని త్యాగం చెయ్యవలసి వస్తుంది.

మహారాధన మహోపదేశం

మహారాధన మహోపదేశం

2018-04-04T18:55:39

ఈ మహారాధన కోసం వచ్చిన సుజనుల అణువణువునా భక్తిపారవశ్యాలు తొణికిసలాడుతుం టాయి. స్వేచ్ఛా జీవిగా వారు జన్మించినా, ఆ స్వేచ్చాధికారాలను తమకు ప్రసాదించిన ఆ సర్వాధి కారి సమక్షంలో మాత్రం వారు దాసులుగా, గులాములుగా ఉండేందుకే ఇష్ట పడతారు.

కలిసి నిలబడండి మీ హృదయాలు కలుస్తాయి

కలిసి నిలబడండి మీ హృదయాలు కలుస్తాయి

2018-04-04T18:55:38

వరుసలు తీరి భుజానికి భుజం ఆనించి నిలబటం, ఒకే నాయకు(ఇమామ్‌)డ్ని అందరూ సమానంగా అనుసరించటం అపురూప విషయం. ఒక జాతి జీవనాన్ని ఒకే సమాహారంలో బంధించే విలక్షణ వ్యవస్థ ఇది.

సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

సభ్యతా సంస్కారాల సరోవరం నమాజు

2018-04-04T18:55:37

నమాజ్‌ విశ్వాస (ఈమాన్‌) మాధుర్యం. అది ఆత్మకు ఆహారం. హృదయానికి శాంతిని, నెమ్మదిని ఇచ్చే అరుదైన టానిక్కు. దాంతో పాటు అది ముస్లింల సామూహిక, నైతిక, సంస్కృతీ నాగరికతల సంస్కరణకు దోహదపడే అత్యుత్తమ పరికరం కూడా.

ఆరాధన పరమార్థం

ఆరాధన పరమార్థం

2018-04-04T18:55:36

‘‘నీవు మంచిని గురించి ఆజ్ఞాపించు, చెడును నివారించు లేదా అజ్ఞానికి జ్ఞానాన్ని ప్రసాదించు లేదా బాధితునికి సహాయపడు లేదా మార్గమధ్యంలో పడివున్న హానికర వస్తువును దూరం చెయ్యి’’

దివ్య ఖుర్‌ఆన్‌ మానవీయ జీవనికి ధర్మదాయి

దివ్య ఖుర్‌ఆన్‌ మానవీయ జీవనికి ధర్మదాయి

2018-04-04T18:55:35

సర్వలోకాన్ని సృష్టించిన ఏకేశ్వరుడు అయిన అల్లాహ్‌ను మరచి ఎందరో దేవుళ్ళు ఉన్నారని తలచి, బహుదైవారాధన (షిర్క్‌కు పాల్పడకు), వ్యభిచారం దరిదాపులకు కూడా పోకు. అది అతి నీచకరమైన బహుచెడ్డ మార్గం,

ఖురాన్ ఘనత

ఖురాన్ ఘనత

2018-04-04T18:55:34

ఖుర్‌ఆన్‌ ఆవతరించి 1435సంవత్సరాలకు పై చిలుకు ఆవుతున్నా నాటి నుండి నేటి వరకు అది భిన్న జాతుల్ని, భిన్న సంస్కృతుల్ని, భిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల్ని ప్రభావితం చేస్తూనే ఉంది. ప్రళయం వరకూ చేస్తూనే ఉంటుంది. మచ్చుకు కొన్ని గాథలు.

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

కారుణ్య గ్రంథం ఖుర్‌ఆన్‌

2018-04-04T18:55:33

”ఖుర్‌ఆన్‌ అది అల్లాహ్‌ వాక్కు, అంతిమ దైవప్రవక్త ముహమ్మద్‌ (స) పై అవతరించిన అంతిమ దైవ గ్రంథం. దాని పారాయణం పుణ్యప్రదం. అందులో ఒకే ఒక్క చిన్న పాటి సూరా లాంటిది ఎవరూ లిఖించి తీసుకు రాలేరు. అది భువనగగనాల్లో అల్లాహ్‌ను చేరుకునే వారధి

తల్లిదండ్రుల సేవ

తల్లిదండ్రుల సేవ

2018-04-04T18:55:32

తల్లిదండ్రుల నిద్రకు భంగం వాటిల్లకూడదని పాలు నిండిన పాత్రను చేతిలో పట్టుకొని రాత్రంగా వారి పాదాల చెంతనే గడిపి ఉదయం వారు లేచాక వారి ఆకలిని తీర్చి ఆ తర్వాత తన ఆలుబిడ్డల ఆకలిని తీర్చిన సుమతులు మన పూర్వీకులు.